భారీ స్థాయిలో దూసుకురానున్న 'దువ్వాడ'
'దువ్వాడ జగన్నాథం' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఓవర్సీస్ లో ఈ సినిమాను 300 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 1800 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

దిల్ రాజు బ్యానర్ పై రూపొందిన 25వ సినిమా కావడం వలన ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తమ సంస్థ పేరును నిలబెట్టేలా ఈ సినిమా ఉంటుందని దిల్ రాజు చెబుతున్నారు. బన్నీ ఫ్యాన్స్ అంచనాలకి తగినట్టుగా ఈ సినిమా ఉంటుందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన చెప్పారు. బన్నీ పాత్రను తీర్చిదిద్దిన తీరు .. ఆయన చూపిన వేరియేషన్స్ .. పూజా హెగ్డే గ్లామర్ .. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు.      
1 min ago
26 mins ago
26 mins ago
55 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com