ఆల్రెడీ అఖిల్ హీరోయిన్ ను ఓకే చేశారా?
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండవ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఖర్చుకి వెనుకాడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం 12 కోట్లు ఖర్చు చేశారంటేనే విషయం అర్థమైపోతోంది. అలాంటి ఈ సినిమాలో కథానాయిక ఎవరా అనే ఆసక్తి అభిమానుల్లో కలుగుతోంది.

 అఖిల్ జోడీగా ఒక హీరోయిన్ ను ఆల్రెడీ ఎంపిక చేశారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. హీరోయిన్ పోర్షన్ కి సంబంధించిన షూటింగ్ మొదలైనప్పుడు, ఆమె పేరును ఎనౌన్స్ చేస్తారట. ఆమె పరిచయంతోనే ప్రమోషన్స్ ను మొదలు పెట్టాలనే ఆలోచనలో  ఉన్నారట. ఒక వైపున షూటింగ్ నడుస్తూ ఉండగానే .. మరో వైపున ప్రమోషన్స్ అదరగొట్టేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి మరి. 
11 mins ago
36 mins ago
36 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com