Ap7am Home
menu ☰

తమన్నా, కాజల్ బాటలో రకుల్!

రకుల్
రకుల్
తెలుగులో ఇలియానా .. తమన్నా .. కాజల్ కథానాయికలుగా ఒక రేంజ్ లో తమ హవాను కొనసాగించారు. తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతూనే బాలీవుడ్ లో చోటు సంపాదించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే వాళ్ల ముగ్గురికీ కూడా ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఇలియానా తెలుగు తెరకి పూర్తిగా దూరం కాగా, తమన్నా .. కాజల్ కొన్ని మంచి అవకాశాలను కోల్పోవలసి వచ్చింది.

ఇక ఇప్పుడు తెలుగులో తన జోరును కొనసాగిస్తోన్న రకుల్ కూడా హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. నీరజ్ పాండే దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా 'ఐయారి' సినిమా చేస్తోంది. కెరియర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే , రకుల్ కూడా నష్టపోవలసి వస్తుందనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది. మరి రకుల్ ఏం చేస్తుందో చూడాలి.  
Twitter Icon
Whatsapp Icon
Facebook Icon
Fri, Jun 16, 2017, 05:32 PM
.
Copyright © 2017; www.ap7am.com