బోయపాటి మూవీకి టైటిల్ ఖరారు!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఒక సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించేలా టైటిల్ ఉండాలనే ఉద్దేశంతో బోయపాటి బాగా కసరత్తు చేశాడు. చివరికి ఈ సినిమాకి 'జయ జానకి నాయక' అనే టైటిల్ ను ఖరారు చేస్తూ .. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాడు.

టైటిల్ .. దానిని డిజైన్ చేయించిన తీరుకి మంచి  రెస్పాన్స్ వస్తోంది. 'శ్రీరామ రాజ్యం' సినిమాలో "జగదానంద కారక .. జయ జానకి ప్రాణ నాయక .. " అనే సాంగ్ ఎంతో పాప్యులర్ అయింది. ఆ పాటలో నుంచి ఈ టైటిల్ ను తీసుకున్నట్టు అర్థమవుతోంది. తన సినిమాలకి పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టే బోయపాటి, ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే టైటిల్ పెట్టడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో మరో కథానాయికగా కేథరిన్ నటించిన సంగతి తెలిసిందే. 
11 mins ago
36 mins ago
36 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com