రామ్ మాంచి స్పీడ్ మీదే వున్నాడు!
తనకి ' నేను శైలజ' సినిమాతో సూపర్ హిట్ ను ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమలతోనే రామ్ తదుపరి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగ్ దశలో వుంది. మేఘా ఆకాశ్ .. అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను గురించి, నిర్మాత రవికిశోర్ మాట్లాడారు.

ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిందనీ, రెండవ షెడ్యూల్ షూటింగును వైజాగ్ లో జరిపామని అన్నారు. మూడవ షెడ్యూల్ షూటింగును హైదరాబాద్ లో పూర్తిచేశామనీ, తదుపరి షెడ్యూల్ ను అరకులో ప్లాన్ చేశామని చెప్పారు. ఈ సినిమాలో రామ్ న్యూ లుక్ తో ఆకట్టుకుంటాడనీ, కథ .. కథనాలు .. కిషోర్ తిరుమల టేకింగ్ .. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు.   
1 min ago
27 mins ago
27 mins ago
56 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com