'స్పైడర్' నుంచి త్వరలో మరో టీజర్!
మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'స్పైడర్' చిత్రం తెరకెక్కుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపుదశకి చేరుకుంది. ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు టీజర్ అందుకు అద్దం పట్టింది కూడా. ఈ టీజర్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ కి ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీ అవుతోంది.

మహేశ్ బాబు పుట్టిన రోజైన ఆగస్టు 9న గానీ .. అంతకంటే ముందుగాని రెండవ టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు. సస్పెన్స్ పోకుండా .. ముఖ్యమైన సన్నివేశాల పైనే ఈ టీజర్ ను కట్ చేస్తున్నారట. 167 ఫ్రేమ్స్ తో కూడిన ఈ టీజర్ లో మహేశ్ బాబు రెండు డైలాగ్స్ కూడా చెబుతాడని అంటున్నారు. సినిమాపై మరింతగా ఆసక్తిని కలిగించేలా .. అంచనాలు పెంచేలా ఈ టీజర్ ఉంటుందని చెబుతున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
8 mins ago
34 mins ago
34 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com