నిహారిక రెండవ మూవీ మొదలైంది!
'ఒక మనసు' సినిమాతో తెలుగు తెరకి నిహారిక పరిచయమైంది. ఈ సినిమా పరాజయం పాలైనా, గ్లామర్ .. నటన పరంగా నిహారికకు మంచి మార్కులు పడ్డాయి.  ఆ తరువాత అవకాశాలు వచ్చినా .. మంచి కథ కోసం ఆమె వెయిట్ చేసింది. ఇటీవల దుర్గా ప్రసాద్ వినిపించిన కథ నచ్చడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమాతో దుర్గాప్రసాద్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ రోజు ఉదయం ఈ సినిమాను లాంచ్ చేశారు. హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టడంతో షూటింగ్ మొదలైంది. రాఘవయ్య - బాబీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా, కథానాయికగా ప్రాధాన్యత కలిగినదా? లేదంటే హీరో వున్నాడా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. పూర్తి వివరాలను త్వరలోనే ఈ సినిమా టీమ్ వెల్లడించే అవకాశం వుంది.   
10 mins ago
35 mins ago
35 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com