అంజలికి ఆయన విషెష్ ప్రత్యేకం!
తమిళంలో ఓ సినిమాలో కలిసి నటిస్తూ అంజలి - జై ప్రేమలో పడ్డారు. వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారంటూ జరుగుతున్న ప్రచారాన్ని అంజలి కానీ .. జై కానీ ఎక్కడా ఖండించలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరికి గల ప్రేమను చాటుకుంటూనే వున్నారు. ఆ మధ్య జై పుట్టిన రోజున .. షూటింగ్ జరుగుతోన్న లొకేషన్ కి అంజలి కేక్ తీసుకెళ్లి మరీ కట్ చేయించింది.

 ఇక ఈ రోజున అంజలి పుట్టిన రోజు కావడంతో, తనదైన శైలిలో ఆమెకి జై విషెష్ చెబుతూ ఒక లెటర్ రాసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. "నా జీవితంలో ప్రతిరోజును నువ్ ప్రత్యేకంగా మార్చేశావ్. దేవుడే కాదు .. నేను కూడా నీకు తోడుగా వుంటాను. హ్యాపీ బర్త్ డే అంజూ .." అంటూ అంజలి పై తనకి గల ప్రేమకి అక్షర రూపం ఇచ్చాడు. ఈ రోజున అంజలికి ఎన్ని గ్రీటింగ్స్ వచ్చినా .. జై తెలిపిన విషెష్ ఆమెకి ప్రత్యేకమని వేరే చెప్పాలా?  
25 mins ago
25 mins ago
54 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com