హైలైట్ సాంగ్ ఆ ఇద్దరిపైనే!
పూరీ జగన్నాథ్ .. బాలకృష్ణ కాంబినేషన్లో 'పైసా వసూల్' సినిమా తెరకెక్కుతోంది. టైటిల్ ను బట్టే ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ కి  కావలసిన అంశాలు పుష్కలంగా వున్నాయనే విషయం అర్థమైపోతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రియ .. ముస్కాన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 'జీవితచక్రం' సినిమాలోని "కంటి చూపు చెబుతోంది .. కొంటె నవ్వు చెబుతోంది .. " అనే పాటను రీమిక్స్ చేసినట్టుగా చెప్పారు. పోర్చుగల్ లో ఈ పాటను చిత్రీకరించామని అన్నారు. దాంతో ఈ పాటలో బాలకృష్ణతో కనిపించే కథానాయిక ఎవరనే సందేహం చాలామందిలో తలెత్తింది. బాలకృష్ణ - ముస్కాన్ లపై ఈ సాంగ్ ను చిత్రీకరించారనేది తాజా సమాచారం. ఈ సాంగ్ లో బాలయ్య వేసిన హుషారైన స్టెప్స్ .. ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించడం ఖాయమని అంటున్నారు. 
7 mins ago
32 mins ago
32 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com