షాక్ ఇస్తోన్న ఇలియానా ఫస్టులుక్!
ఇలియానా బాలీవుడ్ లో 'బాద్ షాహో' సినిమా చేస్తోంది. ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. డీ గ్లామర్ పాత్రలో కనిపిస్తోన్న ఆమె లుక్ ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. నాజూకు సుందరిగా పేరున్న ఆమెను ఇంత డిఫరెంట్ గా చూపించడంతో, ఈ సినిమాపై ఆసక్తిని పెంచుకుంటున్నారు.

 మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, ఇలియానాతో పాటు అజయ్ దేవగణ్ .. ఇమ్రాన్ హష్మీ .. విద్యుత్ జమాల్ .. ఇషా గుప్తా .. సంజయ్ మిశ్రా ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా అయినా ఇలియానాకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.  
24 mins ago
24 mins ago
54 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com