'దువ్వాడ'కి 25 కోట్ల ప్రాఫిట్?
హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దువ్వాడ జగన్నాథం' .. ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వదులుతోన్న టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ .. అంచనాలను మరింతగా పెంచుతూ వెళుతున్నాయి. దాంతో ఈ సినిమా బిజినెస్ ఒక రేంజ్ లో జరిగిందని చెప్పుకుంటున్నారు.

 ఈస్ట్ గోదావరి రైట్స్ ను గీతా ఆర్ట్స్ కి ఇచ్చిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజు, నైజాం .. కృష్ణా .. విశాఖ రైట్స్ మినహా మిగిలిన ఏరియాల హక్కులను అమ్మేశారు. ఇందువలన ఆయనకి దాదాపు 25 కోట్ల వరకూ లాభాలు వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక విడుదల తరువాత వసూళ్ల పరంగా 'దువ్వాడ' ఏ స్థాయిలో దుమ్ము దులిపేస్తాడోననేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ చేరిపోయినట్టేనని అంటున్నారు.   
33 secs ago
25 mins ago
25 mins ago
55 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com