నేటి వార్తలు ... టూకీగా
*  ప్రిన్స్ మహేశ్ బాబు సరసన కన్నడ బ్యూటీ పూజా హెగ్డే నటించే చాన్స్ కనిపిస్తోంది. తాజాగా 'స్పైడర్' చిత్రాన్ని పూర్తి చేసిన మహేశ్.. త్వరలో కొరటాల శివ సినిమా షూటింగులో జాయిన్ అవుతాడు. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో చిత్రం చేస్తాడు. ఆ సినిమా కోసం పూజా హెగ్డేను తీసుకుంటున్నట్టు సమాచారం.    
*  అల్లు అర్జున్ నటించిన 'డీజే' చిత్రాన్ని ఓవర్సీస్ లో సుమారు 300 లొకేషన్స్ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఒక్క అమెరికాలోనే 160 లొకేషన్స్ లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న చిత్రం విడుదల కానుండగా, 22 న అక్కడ ప్రీమియర్ షోలు వేస్తున్నారు.
*  ప్రముఖ దర్శకుడు విఠలాచార్య పేరుతో ఏకంగా ఓ సినిమా రూపొందుతోంది. సుహాస్ మీరా దర్శకత్వం వహిస్తున్న ఈ 'విఠాలాచార్య' చిత్రం షూటింగును నిన్న హైదరాబాదులో ప్రారంభించారు. సూపర్ స్టార్ కృష్ణ మొదటి షాట్ కు క్లాప్ కొట్టగా.. విజయనిర్మల కెమెరా స్విచాన్ చేశారు. తమ పెద్ద మనవడితో పాటు చిన్న మనవడు కూడా ఇందులో నటిస్తున్నాడని విజయనిర్మల తెలిపారు.  
24 mins ago
24 mins ago
53 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com