దీపావళికి పవన్ మూవీ?
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ కొంతవరకూ పూర్తయింది. ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకున్నారు. అయితే పూరీ జగన్నాథ్ తో బాలకృష్ణ చేస్తోన్న సినిమా.. మురుగదాస్ తో మహేశ్ చేస్తోన్న సినిమా ఈ పండగకి విడుదల కానున్నాయి.

 పోనీ సంక్రాంతికి విడుదల చేద్దామనుకుంటే, ఆ పండుగకి చరణ్ సినిమా వస్తున్నట్టుగా చెప్పేశారు. దాంతో పవన్ .. త్రివిక్రమ్ బాగా ఆలోచించి, ఈ రెండు సినిమాలకి మధ్య .. అంటే, దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తున్నారట. అక్టోబర్ 19 దీపావళి కావడం వలన ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, 12 .. 13వ తేదీలలో ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. మరి అదే ఖాయం చేసుకుంటారో .. మార్చుకుంటారో చూడాలి.  
10 mins ago
35 mins ago
35 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com