మణిశర్మ జోరు మళ్లీ మొదలైనట్టే!
తెలుగు పాటకి కొత్త ఉత్సాహాన్ని .. సంబరాన్ని తీసుకొచ్చిన సంగీత దర్శకులలో మణిశర్మ ఒకరు. అగ్రకథానాయకుల సినిమాలకి అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఆయనకి, ఆ తరువాత అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఇటీవల 'జెంటిల్ మన్' సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం, మళ్లీ ఆయన గురించి మాట్లాడుకునేలా చేసింది.

ఇక రీసెంట్ గా విడుదలైన 'అమీతుమీ' సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతానికి ఫుల్ మార్క్స్ పడ్డాయి. త్వరలో సెట్స్ పైకి రానున్న నితిన్ 'లై' సినిమాకి కూడా ఆయనే సంగీతాన్ని అందించారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేయబడిన 'బొంబాట్' సాంగ్ కి యూత్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదంతా చూస్తుంటే .. మణిశర్మ జోరు మళ్లీ మొదలైందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 
3 mins ago
28 mins ago
28 mins ago
57 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com