ఆ సినిమాపైనే ఆశలు పెట్టేసుకుంది!
అందం .. అభినయం ఉన్నప్పటికీ అంతకి మించిన అదృష్టం వుండాలని చాలామంది కథానాయికలు భావిస్తుంటారు. అదృష్టం తోడుగా ఉంటే విజయాలు వరిస్తాయనీ .. విజయం అనేక అవకాశాలను తెచ్చిపెడుతుందని నమ్ముతుంటారు. అందుకే సక్సెస్ కోసం చాలామంది కథానాయికలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు.

 అలాంటివారి జాబితాలో తాజాగా నిక్కీ గల్రాని కూడా చేరిపోయింది. తమిళంలో ఆమె చేసిన సినిమా .. తెలుగులో 'మరకత మణి' పేరుతో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆది పినిశెట్టి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, తన పాత్ర కూడా ఆకట్టుకునేదిలా ఉంటుందని నిక్కీ గల్రాని చెబుతోంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనీ .. తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.   
5 mins ago
30 mins ago
30 mins ago
59 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com