సమంతాతో చైతూ తమిళ మూవీ!
'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో రకుల్ ను తీసుకోవడానికి ముందు సమంతాను అనుకున్నారు. అప్పటికే చైతూ .. సమంతాల ప్రేమ వ్యవహారం బయటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ జంట తెరపై కనిపిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందువల్లనో సమంతాను కాకుండా రకుల్ కి ఛాన్స్ ఇచ్చారు.

 అక్టోబర్లో చైతూ .. సమంతాల వివాహం జరగనుండటంతో, మరోసారి ఈ జంటను తెరపై చూడటం కుదరదేమోనని అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే తెలుగుకంటే ముందు తాము తమిళ సినిమా చేసే ఛాన్స్ ఉందని చైతూ చెప్పాడు. వచ్చే ఏడాది తాను ఓ తమిళ సినిమా చేయాలనుకుంటున్నాననీ, అందులో కథానాయికగా సమంతానే ఉంటుందని అన్నాడు. తమిళంలో సమంతాకు మంచి క్రేజ్ వుంది కనుకనే చైతూ ఇలా ప్లాన్ చేశాడని చెప్పుకుంటున్నారు.  
8 mins ago
33 mins ago
33 mins ago
1 hour ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com