ఆశ్చర్యపరుస్తోన్న '2.0' శాటిలైట్ రైట్స్!
ఇటు రజనీ అభిమానులు .. అటు అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ '2.0' సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. షూటింగు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇది శంకర్ సినిమా కావడం వలన బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతోందని అంటున్నారు.

 ఈ సినిమా హిందీ హక్కులు 80 కోట్లకి అమ్ముడు కావడం విశేషం. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రేటు కూడా ఆశ్చర్య చకితులను చేస్తోంది. అన్ని భాషల్లోను కలుపుకుని ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ టీవీ వారు 110 కోట్లకి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే విడుదలకి ముందే ఈ సినిమా దాదాపు 200 కోట్లను రాబట్టినట్టు అవుతుంది.   
2 mins ago
27 mins ago
27 mins ago
56 mins ago
1 hour ago
1 hour ago
3 hours ago
13 hours ago
16 hours ago
17 hours ago
Copyright © 2017; www.ap7am.com