Ap7am Home
menu ☰

ఇది శివుడి లీలావిశేషమే

పరమశివుడు ఆవిర్భవించిన ఆలయాలు .. ఆ స్వామి మహిమలకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఆయన లీలావిశేషాలకు ప్రతీకగా కనిపిస్తూ పూజాభిషేకాలు అందుకుంటున్నాయి. అలా ఆ స్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి ఒరిస్సా - బాలాసోర్ జిల్లా 'కుంభీర్ గాడి' గ్రామ పరిధిలో దర్శనమిస్తుంది. ఇక్కడి శివలింగం .. పైకి ఆరడుగుల వరకు మాత్రమే కనిపిస్తుంది. దాని పీఠభాగం ఎంతవరకూ వుందనేది ఎవరికీ తెలియదు.

 ఈ శివలింగాన్ని మరో ప్రదేశానికి తరలించి అక్కడ ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. లింగం అడుగుభాగం ఎక్కడి వరకూ ఉందనే విషయాన్ని వాళ్లు కనుగొనలేకపోయారు. అది స్వామి మహిమగా భావించిన ఆ గ్రామస్తులు అక్కడే ఆలయాన్ని నిర్మించారు. 'భుసందేశ్వరుడు'గా స్వామికి నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. స్వామి అక్కడ ప్రత్యక్షంగా వున్నాడని భావించిన భక్తులు, విశేషమైన పర్వదినాల్లో మరింత భక్తి శ్రద్ధలతో ఆయనని కొలుస్తుంటారు.          
Twitter Icon
Whatsapp Icon
Facebook Icon
Mon, May 08, 2017, 09:01 AM
Agency: ap7am Desk
Copyright © 2017; www.ap7am.com