Ap7am Home
menu ☰

అక్షయ తృతీయన ఈ దానాలు చేయాలి

వైశాఖ శుద్ధ తదియ రోజు 'అక్షయ తృతీయ'గా చెప్పబడుతోంది. ఈ రోజున ఏ పుణ్య కార్యం చేసినా దాని ఫలితం అక్షయంగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున మంచినీటిని దానం చేయడం వలన, రానున్న జన్మలు ఎలాంటివైనా దాహంతో బాధపడవలసిన పరిస్థితి ఉండదని స్పష్టం చేస్తున్నాయి.

అంతేకాదు ఈ రోజున పాద రక్షలను .. గొడుగును .. ఆవును .. బంగారాన్ని .. వస్త్రాలను .. భూమిని దానం చేయడం మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు అంటున్నాయి. ఈ పుణ్య ఫల విశేషం కారణంగా .. సుఖశాంతులతోను .. సంపదలతోను కూడిన జీవితం లభిస్తుందని చెబుతున్నాయి. ముందుజన్మలకి అవసరమైన పుణ్య ఫలాలను సంపాదించుకోవడానికి లభించిన 'అక్షయ తృతీయ' అనే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోకూడదు.         
Twitter Icon
Whatsapp Icon
Facebook Icon
Thu, Apr 27, 2017, 09:20 AM
Agency: ap7am Desk
Copyright © 2017; www.ap7am.com